భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు…మరో 717 మంది మృతి!

Wednesday, October 21st, 2020, 10:47:53 AM IST

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులుగా తగ్గినట్లు కనిపించినా, మళ్లీ కేసులు ఎక్కువగా నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 10,83,608 నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 54,044 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే నిర్దారణ పరీక్షలు ఎక్కువగా పెంచడం కారణంగా ఎక్కువ మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు నిపుణులు అంటున్నారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 76,51,108 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 717 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,15,914 కి చేరింది. అయితే కరోనా వైరస్ మరణాల రేటు ప్రస్తుతం భారత్ లో 1.51 శాతంగా ఉంది.

కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. భారత్ లో ప్రస్తుతం 88.81 శాతంగా కరోనా వైరస్ రికవరీ రేటు ఉండగా, ఇప్పటి వరకు 67,95,103 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో 7,40,090 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.