కరోనా అప్డేట్: ఏపీ లో మరో 7,073 కేసులు…48 మరణాలు!

Friday, September 25th, 2020, 06:50:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 7,073 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,58,563 కి చేరింది. అయితే ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

తాజాగా మరొక 48 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మరణాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,606 కి చేరింది.

అయితే కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 8,695 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 5,85,274 కి చేరింది. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 67,683 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.