భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు… మరో 704 మంది మృతి!

Thursday, November 5th, 2020, 11:28:27 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో మరో 50,210 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 83,64,086 కి చేరింది. అయితే గత కొద్ది రోజులుగా 50 వేలకు దిగువ న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉండగా, మళ్ళీ కేసులు పెరగడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 704 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు.అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,24,315 కి చేరింది. అయితే ఇప్పటి వరకు భారత్ లో 77,11,809 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 5,27,962 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ గా ఉన్నాయి.