భారత్ లో కొనసాగుతున్న కరోనా ఉధృతి…మరో 702 మంది మృతి!

Thursday, October 22nd, 2020, 10:48:26 AM IST

భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు తగ్గినట్లే అనిపించినా, ఎక్కువగా నిర్దారణ పరీక్షలు నిర్వహించడం తో మళ్లీ ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అని అధికారులు అంటున్నారు. గడిచిన 24 గంటల్లో 14,69,984 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 55,838 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 77,06,946 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 702 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,16,616 కి చేరింది.

అయితే కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 79,415 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకూ 68,74,518 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో 7,15,812 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.