ఏపీ లో మరో 70 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Tuesday, February 9th, 2021, 07:12:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 26,844 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 70 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,88,555 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా నేడు ఎవరూ మృతి చెందలేదు. ఇప్పటి వరకూ 7,160 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 115 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 8,80,478 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 917 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.