భారత్ లో కొనసాగుతూనే ఉన్న కరోనా ఉధృతి…మరో 690 మంది మృతి!

Friday, October 23rd, 2020, 11:00:44 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 14,42,722 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 54,366 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 77,61,312 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 690 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ ఈ వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,17,306 కి చేరింది. నిన్న ఒక్కరోజే 73,979 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకూ 69,48,497 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 6,95,509 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గానే ఉండగా, మృతుల రేటు 1.51 శాతంగా ఉంది.