తెలంగాణలో మరో 682 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Tuesday, December 8th, 2020, 10:25:01 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 55,645 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 682 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,74,540 కి చేరింది. అయితే ఇంకా ఈ మహమ్మారి కి పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,477 కి చేరింది. నిన్న ఒక్కరోజే 761 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకొగా, ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కారొన్ వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,65,367 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 7,696 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ గా ఉన్నాయి.