బిగ్ న్యూస్: భారత్ లో 73 లక్షలకు పైగా నమోదు అయిన కరోనా కేసులు

Thursday, October 15th, 2020, 11:55:02 AM IST

భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 67,708 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 73,07,098 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య భారత్ లో పెరుగుతూనే ఉంది.

గడిచిన 24 గంటల్లో 680 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,11,266 కి చేరింది. ఈ కరోనా వైరస్ మృతుల సంఖ్య సైతం ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

అయితే భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉంది అని చెప్పాలి. ఇప్పటి వరకు 63,83,442 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 8,12,390 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టి వ్ గా ఉన్నాయి. ఇంకా ఈ మహమ్మారి కి పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కరోనా వైరస్ ఉదృతి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.