ఏపీ లో మరో 667 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, December 7th, 2020, 12:00:22 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 60,329 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 667 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,71,972 కి చేరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఈ మహమ్మారికి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో తొమ్మిది మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 7,033 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 914 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకు రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 8,59,029 కి చేరింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంకా 5,910 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.