తెలంగాణలో మరో 661 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, November 15th, 2020, 11:09:15 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 21,264 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 661 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,57,374 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,404 కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,637 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో 2,40,545 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో ఇంకా 15,425 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ గా ఉన్నాయి.