భారత్ లో 25 లక్షలు దాటిన కరోనా కేసులు…50 వేలకు చేరువలో మరణాలు!

Saturday, August 15th, 2020, 11:38:41 AM IST

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రోజుకి 60 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం తో దేశంలోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 65,002 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కేసులతో కలిపి మొత్తం భారత్ లో నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 25,26,192 కి చేరింది.

అయితే అదే విధంగా కరోనా వైరస్ భారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 996 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 49,036 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 57,381 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,08,936 కి చేరింది. అయితే ప్రస్తుతం దేశం లో 6,68,220 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.