తెలంగాణలో మరో 635 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, December 23rd, 2020, 10:26:20 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 45,609 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 635 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,82,982 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,522 కి చేరింది. అయితే నిన్న ఒక్కరోజే 573 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోగా, ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,74,833 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 6,627 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.