కరోనా అప్డేట్: ఏపీ లో మరో 7,822 కేసులు…63 మరణాలు!

Monday, August 3rd, 2020, 08:49:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నిన్న ఉదయం 9 గంటల నుండి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 45,516 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 7,822 పాజిటివ్ లు గా తేలింది. అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా నమోదు అయిన ఈ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పటి వరకూ 1,55,586 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అయితే ఇదే తరహాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నేడు ఒక్క రోజే 63 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 1,537 కి చేరింది. కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరగడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 76,377 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉండగా, ఇప్పటి వరకూ 88,672 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్క రోజులో నే 5,786 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.