ఏపీ లో మరో 6,242 కరోనా కేసులు…40 మరణాలు!

Monday, October 5th, 2020, 12:00:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ ను అరికట్టడం లో రాష్ట్రం ప్రభుత్వ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 6,242 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,19,256 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో గడిచిన 24 గంటల్లో మరో 40 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,981 కి చేరింది. కరోనా వైరస్ రికవరీ రేటు ఏపీ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 7,084 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 6,58,875 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 54,400 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.