తెలంగాణలో మరో 622 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, December 6th, 2020, 11:02:52 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 57,308 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 622 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,73,341 కి చేరింది. ఈ మహమ్మారి కి ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ మహమ్మారి చికిత్స పొందుతూ ఇద్దరు తుది శ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,472 కి చేరింది. నిన్న ఒక్కరోజే 993 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో 2,63,744 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 8,125 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ గా ఉన్నాయి.