ఏపీ లో మరో 620 మందికి సోకిన కరోనా

Sunday, November 29th, 2020, 11:18:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 54,710 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 620 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,67,683 కి చేరింది. ఇప్పటి వరకు 1,00,17,126 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

అయితే ఈ కరోనా వైరస్ తీవ్రత ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 6,988 కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,787 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ 8,52,298 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 8,397 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.