ఏపీ లో మరో 62 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, February 8th, 2021, 05:45:52 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 22,094 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 62 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,85,590 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ చికిత్స పొందుతూ గడిచిన 24 గంటల్లో మరొక వ్యక్తి మృతి చెందారు. అయితే ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి రాష్ట్రం లో ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 7,160 కి చేరింది. నిన్న ఒక్క రోజే 102 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 8,77,468 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 962 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.