బిగ్ న్యూస్: ఏపీ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే!

Wednesday, September 30th, 2020, 12:17:28 AM IST

Corona
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు. గడిచిన 24 గంటల్లో 68,429 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 6,190 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,84,456 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 35 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మృతి చెందిన వారి సంఖ్య 5,780 కి చేరింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 9,836 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 6,19,241 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 59,435 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.