తెలంగాణలో మరో 612 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Friday, December 11th, 2020, 10:07:58 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 56,178 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 612 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,76,516 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,485 కి చేరింది. అయితే నిన్న ఒక్కరోజే 502 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారి తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,67,427 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 7,604 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.