భారత్ లో 96 కి చేరిన కొత్త రకం కరోనా కేసులు

Monday, January 11th, 2021, 04:22:13 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతుంది అని, వాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుంది అంటూ కాస్త ఊరట కలిగింది అనుకొనే లోపే, ఈ కొత్త రకం కరోనా వైరస్ దేశం లోకి అడుగు పెట్టింది. అయితే యూ కే లో దీని ప్రభావం ఎక్కువగా ఉండటం, ఇతర దేశాల్లో కూడా దీన్ని ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు తీసుకోవడం తో భారత్ కూడా అప్రమత్తం అయింది. అయితే శనివారం నాటికి 90 గా ఉన్న ఈ కేసులు ఆదివారం నాడు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అయితే సోమవారం నాడు మరొక 6 కేసులు నమోదు కావడం తో మొత్తం భారత్ లో కొత్త రకం కరోనా కేసులు 96 కి చేరాయి.

ఈ మహమ్మారి భారిన పడినవారిని ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇప్పటికే బ్రిటన్ కి విమాన సేవలను తిరిగి ప్రారంభించిన భారత్, అక్కడి నుండి వచ్చే వారికి నిర్దారణ పరీక్షలు నిర్వహించి, 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించడం జరిగింది. అయితే ఈ కేసుల సంఖ్య పెరగడం పట్ల పలువురు నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.