బిగ్ న్యూస్: భారత్ లో 90 లక్షలు దాటిన కరోనా కేసులు…మరో 584 మంది మృతి!

Friday, November 20th, 2020, 10:23:43 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో ప్రజలు కరోనా వైరస్ భారిన పడుతున్నారు. ఇప్పటికే నమోదు అవుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కేసులు 90 లక్షలకు పైగా నమోదు కావడం తో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు అంతా సూచిస్తున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో 10,83,397 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 45,882 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 90,04,366 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నా, కరోనా వైరస్ రికవరీ రేటు ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే 44,807 మంది కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారి తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 84,28,410 కి చేరింది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 584 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,32,162 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 4,43,794 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.