కరోనా అప్డేట్: ఏపీ లో మరో 5,795 కేసులు…33 మరణాలు!

Tuesday, October 6th, 2020, 10:12:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 5,795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,26,412 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 33 మంది కరోనా వైరస్ కి చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. తాజాగా ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారితో కలిపి ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 6,052 కి చేరింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 6,046 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 6,69,584 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 50,776 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.