భారత్ లో కొనసాగుతూనే ఉన్న కరోనా ఉధృతి…మరో 579 మంది మృతి

Monday, October 19th, 2020, 10:50:21 AM IST

భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్ లో నేటికీ 75 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 8,59,786 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 55,722 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడ్డ వారి సంఖ్య 75,50,273 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 579 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం దేశం లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,14,610 కి చేరింది. అయితే భారత్ లో ఇప్పటి వరకూ 66,63,608 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 7,72,055 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. భారత్ లో మరణాల రేటు 1.52 శాతంగా ఉండగా, రికవరీ రేటు 88.26 శాతంగా ఉంది.