బిగ్ న్యూస్: భారత్ లో మరో 50,129 కేసులు…578 మరణాలు!

Sunday, October 25th, 2020, 01:15:20 PM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 11,40,905 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 50,129 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే గత కొద్ది రోజులుగా 60 వేలకు దిగువనే ఈ పాజిటివ్ కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 78,64,811 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 578 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,18,534 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ మృతుల శాతం 1.51 గా ఉంది.

కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 62,077 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకూ 70,78,123 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా రికవరీ రేటు ప్రస్తుతము దాదాపు 90 శాతంగా ఉంది. అయితే ప్రస్తుతం భారత్ లో 6,68,154 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. కరోనా వైరస్ యాక్టివ్ కేసుల శాతం 8.50 శాతంగా ఉంది.