బిగ్ న్యూస్: భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు…మరో 577 మంది మృతి!

Saturday, November 7th, 2020, 01:26:40 PM IST

india_corona

భారత దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే మహమ్మారి తీవ్రత తో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 11,13,209 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 50,357 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 84,62,081 కి చేరింది. అయితే ఇంకా ఈ మహమ్మారికి పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 577 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 1,25,562 కి చేరింది. నిన్న ఒక్కరోజే 53,920 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 78,19,887 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 5,16,632 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.