ఏపీ లో మరో 55 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, February 14th, 2021, 06:58:47 PM IST

AP_corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 28,788 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 55 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,85,974 కి చేరింది.

అయితే కరోనా వైరస్ తీవ్రత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చాలా తక్కువగా ఉందని చెప్పాలి. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా వైరస్ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇప్పటి వరకూ 7,162 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఒక్క రోజే 117 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 8,78,077 కి చేరింది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.