భారత్ లో మరో 44,489 కరోనా కేసులు…524 మరణాలు

Thursday, November 26th, 2020, 11:54:17 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 10,90,238 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 44,489 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 92,66,705 కి చేరింది. అయితే ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 524 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,35,223 కి చేరింది. ఇప్పటి వరకూ భారత్ లో 86,79,138 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4,52,344 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిి వ్ గా ఉన్నాయి.