భారత్ లో 80 లక్షలు దాటిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, October 29th, 2020, 11:25:56 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది. భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 80 లక్షలకు పైగా చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 10,75,760 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 49,881 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 80,40,203 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 517 మంది కరోనా వైరస్ భారిన పడి తుది శ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,20,527 కి చేరింది. నిన్న ఒక్కరోజే 56,480 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోగా, ఇప్పటి వరకూ 73,15,989 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 6,03,687 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.