బిగ్ న్యూస్: ఏపీ లో పెరుగుతున్న కరోనా రికవరీ కేసులు!

Wednesday, October 7th, 2020, 07:34:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 66,769 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 5,120 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,31,532 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 34 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మృతి చెందిన వారి సంఖ్య 6,086 కి చేరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ రికవరీ కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి.

గడిచిన 24 గంటల్లో 6,349 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 6,75,933 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 49,513 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.