బిగ్ న్యూస్: భారత్ లో మరో 44,059 కేసులు…511 మరణాలు

Monday, November 23rd, 2020, 10:50:14 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 8,49,596 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 44,059 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 91,39,866 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 511 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,33,738 కి చేరింది. నిన్న ఒక్కరోజే 41,024 మంది కరోనా వైరస్ నుండి కొలుకొగా, ఇప్పటి వరకూ 85,62,641 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4,43,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.