ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…మరో 51 మంది మృతి!

Monday, September 21st, 2020, 06:16:50 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ ను అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కువ గా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం తో ఏపీ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు, మెరుగైన వైద్య చికిత్స కారణం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

గడిచిన 24 గంటల్లో 56,569 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 6,235 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,28,854 కి చేరింది. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గడిచిన 24 గంటల్లో 51 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 5,410 కి చేరింది. అయితే ప్రస్తుతం తీసుకుంటున్న జాగ్రత్త చర్యల ద్వారా కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 10,502 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య5,48,926 కి చేరింది. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 74,518 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.