కరోనా అప్డేట్: ఏపీ లో మరో 7,553 కేసులు…51 మరణాలు!

Tuesday, September 22nd, 2020, 08:43:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 68,829 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 7,553 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,36,407 కి చేరింది. ఈ కేసుల సంఖ్య రాష్ట్రం లో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 51 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో ఈ మహమ్మారి భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 5,461 కి చేరింది. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

గడిచిన 24 గంటల్లో 10,555 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకూ ఈ మాహమ్మారి భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,59,481 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 71,465 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.