తెలంగాణలో మరో 509 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, December 17th, 2020, 11:00:13 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 48,652 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 509 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,79,644 కి చేరింది. అయితే దీని తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,505 కి చేరింది. నిన్న ఒక్కరోజే 517 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకో గా, ఇప్పటి వరకు 2,70,967 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 7,172 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.