భారత్ లో మరో 43,893 కరోనా వైరస్ కేసులు…508 మరణాలు!

Wednesday, October 28th, 2020, 11:15:10 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,83,608 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 43,893 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 79,90,322 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 508 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,20,010 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ మృతుల రేటు ప్రస్తుతం 1.50 గా ఉంది.

కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరొ 58,439 మంది కోలుకున్నారు. భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 72,58,509 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు 90.85 శాతంగా ఉంది. అయితే మొత్తంగా ప్రస్తుతం భారత్ లో 6,10,803 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. యాక్టిివ్ కేసుల రేటు 7.64 శాతంగా ఉంది.