ఏపీ లో మరో 506 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, December 13th, 2020, 11:20:43 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 63,873 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 506 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,75,531 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం కారణంగా ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో అయిదుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 7,057 కి చేరింది. నిన్న ఒక్కరోజే 613 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 8,63,508 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 4,966 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.