తెలంగాణలో మరో 502 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, November 16th, 2020, 09:26:47 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 17,296 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 502 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,57,876 కి చేరింది. అయితే ఇంకా కరోనా వైరస్ మహమ్మారికి వాక్సిన్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,407 కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,539 మంది కరోనా వైరస్ మహమ్మారి నుండి కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,42,084 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 14,385 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.