భారత్ లో మరో 5 కరోనా స్ట్రెయిన్ కేసులు

Thursday, December 31st, 2020, 12:52:58 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న తరుణంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే భారత్ లో ఈ మహమ్మారి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బ్రిటన్ నుండి వచ్చే అంతర్జాతీయ విమాన సేవలను భారత్ ఇప్పటికే తాత్కాలికం గా నిలిపివేసింది. అయితే ఇప్పటికే 20 కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు భారత్ లో నమోదు అయ్యాయి. అయితే ఈ కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ఐదుగురికి కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

తాజాగా నమోదు అయిన ఈ అయిదు కొత్త రకం కరోనా వైరస్ లతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు 25 కేసులు నమోదు అయ్యాయి. పుణె లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ లో నాలుగు కేసులను, ఢిల్లీ లోని ఐ జీ ఐ బీ లో ఒక కేసును గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆ 25 మంది కరోనా వైరస్ స్ట్రెయిన్ బాధితులను ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. అయితే గత నెలలో బ్రిటన్ నుండి మొత్తం 30 వేల మందికి పైగా రావడం, వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.