తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Saturday, March 27th, 2021, 10:17:04 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి భారీగా కేసుల నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 58,029 కరోనా పరీక్షలు నిర్వహించగా 495 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804 కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,878 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 247 మంది కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,685 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 99,61,154 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.06 శాతం ఉండగా, మరణాల రేటు 0.55% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.