భారత్ లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు…మరో 490 మంది మృతి!

Tuesday, November 3rd, 2020, 11:09:09 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. దీని తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో దేశంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 10,46,247 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 38,310 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 82,67,623 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 490 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య 1,23,097 కి చేరింది. ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 76,03,121 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 5,41,405 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.