దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు…మరో 488 మంది మృతి

Tuesday, October 27th, 2020, 11:05:29 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది అని చెప్పాలి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి. నేడు నలభై వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 9,58,116 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 36,469 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 79,46,429 కి చేరింది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 488 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా మొదలైన ఈ కరోనా వైరస్ మరణాల తో భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,19,502 కి చేరింది. నిన్న ఒక్క రోజే 63,842 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకూ 72,01,070 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 6,25,857 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.