తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Monday, May 10th, 2021, 10:57:40 PM IST

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనాను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నప్పటికి పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 65,923 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,826 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,02,187కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 4,36,619 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 62,797 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 7,754 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 32 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,771 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,36,78,927 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 86.94 శాతం ఉండగా, మరణాల రేటు 0.55% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.