భారత్ లో మరో 36,011 కరోనా కేసులు…482 మరణాలు

Sunday, December 6th, 2020, 12:35:11 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 11,01,063 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 36,011 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 96,92,920 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 482 మంది కరోనా వైరస్ మహమ్మారి కి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,40,182 కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 41,970 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 91,00,792 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 4,03,248 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.