తెలంగాణలో కొత్తగా 4,801 కరోనా కేసులు.. మరో 32 మంది మ్ర్టి..!

Tuesday, May 11th, 2021, 11:51:53 PM IST

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 75,289 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,801 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,06,988కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 4,44,049 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 60,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 7,430 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 32 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,803కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,37,54,216 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 87.58 శాతం ఉండగా, మరణాల రేటు 0.55% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.