భారత్ లో మరో 38,617 కేసులు…474 మరణాలు!

Wednesday, November 18th, 2020, 11:20:52 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 9,37,279 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 38,617 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 89,12,907 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 474 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,30,993 కి చేరింది. అయితే భారత్ లో ఇప్పటి వరకూ 83,35,109 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 4,46,805 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిి వ్ గా ఉన్నాయి.