ఏపీ లో మరో 4,622 కరోనా కేసులు నమోదు

Tuesday, October 13th, 2020, 07:50:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 72,082 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 4,622 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,60,678 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 35 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 6,291 కి చేరింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 5,715 మంది కరోనా వైరస్ నుండి కొలుకొగా, ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 7,11,532 కి చేరింది. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 42,855 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.