ఏపీ లో మరో 7,228 కేసులు…45 మరణాలు

Wednesday, September 23rd, 2020, 06:01:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకీ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 7,228 మంది కరోనా భారిన పడ్డారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 6,43,635 కి చేరింది.ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే విధంగా గడిచిన 24 గంటల్లో 45 మంది కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మొత్తం కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,506 కి చేరింది. అయితే ఒక్కరోజులో నే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 8,291 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 5,67,772 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 70,357 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.