భారత్ లో మరో 41,100 కరోనా కేసులు…447 మరణాలు!

Sunday, November 15th, 2020, 02:29:02 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. దీని తీవ్రత అక్కడక్కడా తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. తాజాగా మరో 8,05,589 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 41,100 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 87,73,479 కి చేరింది. అయితే ఇంకా వాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 447 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,29,635 కి చేరింది. నిన్న ఒక్కరోజే 42,156 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 82,05,728 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 4,79,216 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.