బిగ్ న్యూస్: భారత్ లో తగ్గుతున్న కేసులు…పెరుగుతున్న మరణాలు!

Tuesday, May 18th, 2021, 11:48:59 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 18,69,223 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,63,553 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2 కోట్ల 52 లక్షలకు పైగా చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయితే నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ అత్యధికంగా 4,205 మరణాలు నమోదు కాగా, తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 4,329 కరోనా వైరస్ మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో అత్యధిక మరణాలు ఇవే. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,78,719 కి చేరింది. నిన్న ఒక్క రోజే 4,22,436 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. కరోనా వైరస్ రికవరీ లు రోజురోజుకీ పెరుగుతూ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ఇప్పటి వరకూ భారత్ లో 2,15,96,512 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 33,53,765 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.