బిగ్ న్యూస్: తెలంగాణలో మరో 431 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, March 24th, 2021, 10:20:46 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 70,280 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 431 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,04,298 కి చేరింది. అయితే ఈ కేసులు 400 కి పైగా నమోదు కావడం పట్ల ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,676 కి చేరింది. నిన్న ఒక్క రోజే 228 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో 2,99,270 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో యాక్టిివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 3,352 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. మరో పక్క దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.