భారత్ లో మరో 3,48,421 కేసులు…4,205 మరణాలు

Wednesday, May 12th, 2021, 10:32:17 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 19,83,804 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,48,421 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2 కోట్ల 33 లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ స్ట్రెయిన్ వైరస్ తో ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 4,205 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,54,197 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 3,55,338 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య కోటి 93 లక్షల కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉన్నా, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ప్రస్తుతం భారత్ లో 37,04,099 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.